: ఈ డివైజ్ ను చార్జింగ్ చేసే పద్ధతే వేరు!


యాంపి అనే కంపెనీ ఒక సరికొత్త చార్జింగ్ డివైజ్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. మొబైల్, ఐపాడ్‌లు చార్జింగ్ నిమిత్తం ఉపయోగించే ఈ పరికరానికి విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మన నుంచే! ఎట్లా అంటే... మొదట, ఈ డివైజ్ ను మన శరీరానికి అమర్చుకోవాలి. నడవటమో, పరిగెత్తడమో, ఇట్లా ఏదో ఒక రకమైన వ్యాయామం చేయడం ద్వారా మన శరీరం నుంచి గతిజశక్తి విడుదల అవుతుంది. ఈ శక్తిని విద్యుత్ శక్తిగా ఈ డివైజ్ మార్చుకుంటుంది. తద్వారా ఆ పరికరంతో మొబైల్, ఐ పాడ్ వంటి పరికరాలను చార్జింగ్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News