: హీరో కంపెనీ డైరెక్టర్ సంవత్సరాదాయం 44 కోట్లు!


టాప్ లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీలలో ఎక్కువ మొత్తంలో జీతం తీసుకునే డైరెక్టర్ల జాబితాలో హీరో మోటార్ కార్పొరేషన్ ప్రొమోటర్, డైరెక్టర్ పవన్ ముంజల్ మొదటి స్థానంలో ఉన్నారు. ఏడాదికి ఆయన తీసుకునే వేతనం సుమారు రూ.44 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.44 కోట్లు ఆయన తీసుకున్నట్లు ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది. నిఫ్టీ కంపెనీలకు సంబంధించిన 95 మంది డైరైక్టర్ల వేతనాలపై విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అత్యధిక వేతనం పొందే మొదటి ముగ్గురు డైరెక్టర్లు హీరో మోటార్స్ కార్పొరేషన్ నుంచి ఉండటం విశేషం. టాప్-10 లో లుపిన్ సంస్థ నుంచి ఇద్దరు ప్రొమోటర్లు ఉన్నారు.

  • Loading...

More Telugu News