: టీవీ నటిపై అత్యాచారానికి పాల్పడ్డ నటుడిపై కేసు
'క్యూంకీ సాస్ కభీ బహూ థీ' సీరియల్ ద్వారా పేరు ప్రతిష్ఠలు సంపాదించిన యశ్ పండిట్ పై అత్యాచారం కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసినట్టు ఓ టీవీ నటి ముంబైలోని జూహూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో యశ్ పండిట్ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేశాడు. కేసు వివరాల్లోకి వెళ్తే...సెప్టెంబర్ 13న సీరియల్ షూటింగ్ సెట్స్ పై ఆమెను యశ్ పండిట్ కలిశాడు. తరువాత కొంత కాలానికి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో వివాహం చేసుకుంటానని చెప్పి కారులో అసహజరీతిలో ఆమెతో శృంగారం చేశాడు. తరువాత తన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తానని పిలిచి ఒకసారి, వేరే పని వుందని ఇంటికి పిలిచి ఇంకోసారి కోరిక తీర్చుకున్నాడని, ఆ తరువాత తనను దూరం పెట్టడం ప్రారంభించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో ఇలా చాలా మందితో గడిపానని యశ్ పండిట్ తనతో అన్నాడని, వారంతా అపఖ్యాతి పాలవుతామని భావించి పోలీసులను ఆశ్రయించి ఉండరని, ఇలాంటి వ్యక్తిని క్షమించకూడదని తాను కేసు పెట్టానని ఆమె చెప్పింది.