: సాఫ్ట్ వేర్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న చెన్నై వర్షాలు


సాఫ్ట్ వేర్ కంపెనీలకు తమిళనాడులో కురిసిన వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై కేంద్రంగా సేవలు అందిస్తున్న ఐబీఎం, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమిని, టీసీఎస్ తదితర సాఫ్ట్ వేర్ సంస్థల ఉద్యోగులు విధులకు హాజరుకాలేకపోతున్నారు. దీంతో ఆయా సంస్థల యాజమాన్యాలపై వాటి క్లయింట్లు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో విషయం వారికి వివరించలేక సదరు కంపెనీలు నానాయాతన పడుతున్నాయి. పోనీ వర్క్ ఫ్రమ్ హోం చేయమందామంటే చెన్నైలోని వివిధ ప్రాంతాలకు విద్యుత్ ఉండడం లేదు. ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో పలు కంపెనీలు ఆయా సంస్థల ఉన్నతోద్యోగులను బెంగళూరు వెళ్లి పని చేయాలని ఆదేశాలు జారీ చేశాయి.

  • Loading...

More Telugu News