: భారత మార్కెట్ లోకి ఇన్ ఫోకస్ కొత్త స్మార్ట్ ఫోన్


భారత మార్కెట్ లోకి అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ ఫోకస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ప్రవేశించింది. ఇన్ ఫోకస్ ఎం808 పేరిట దీనిని విడుదల చేశారు. స్నాప్ డీల్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఈ ఫోన్ ధర రూ.12,999లుగా ప్రకటించారు. మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. 5.2 అంగుళాల తాకే తెర (టచ్ స్క్రీన్), 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 13 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2450 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నాయి.

  • Loading...

More Telugu News