: పేర్వారం నివాసానికి మనవల మృతదేహాలు తరలింపు
మాజీ డీజీపీ, తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పేర్వారం రాములు ఇద్దరు మనవళ్లు వరుణ్, అమిత్ లు ఈరోజు హైదరాబాద్ నగర శివారులోని కోకాపేట వద్ద రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ పంజాగుట్టలోని పేర్వారం నివాసానికి వారిద్దరి మృతదేహాలను పోలీసులు తరలించారు. కాగా ఈ ప్రమాదంలో వారితో ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా వెళుతున్న పాల ట్యాంకర్ ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.