: చెలరేగిన సఫారీలు...215 పరుగులకే టీమిండియా ఆలౌట్


నాగ్ పూర్ టెస్టులో సఫారీ బౌలర్లు చెలరేగారు. మోర్నీ మోర్కెట్, హార్మర్ ధాటికి టీమిండియా కల చెదిరింది. టాస్ గెలిచి భారీ స్కోరు సాధిద్దామని భావించిన టీమిండియా కెప్టెన్ అంచనాలను పటాపంచలు చేస్తూ కేవలం 215 పరుగులకే ఆలౌట్ చేశారు. బ్యాటింగ్ ప్రారంభించిన మురళీ విజయ్ (40) ఓ మోస్తరుగా రాణించినా, శిఖర్ ధావన్ (12) మళ్లీ విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా (21), కెప్టెన్ కోహ్లీ (22) భారీ స్కోర్లు సాధించలేకపోయారు. అజింక్యా రెహానే (13), రోహిత్ (2) కూడా నిరాశపరిచారు. అనంతరం కీపర్ వృద్ధిమాన్ సాహా(32), రవీంద్ర జడేజా (34) రాణించారు. దీంతో టీమిండియా 200 మార్కు దాటింది. అనంతరం వచ్చిన అశ్విన్ (15), మిశ్రా (3) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. దీంతో టీమిండియా 215 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో హార్మర్ నాలుగు వికెట్లు తీసి రాణించగా, మోర్కెల్ మూడు, రబడా, ఎల్గర్, తాహిర్ చెరో వికెట్ తీసి చక్కని సహకారమందించారు.

  • Loading...

More Telugu News