: రోహిత్ కూడా విఫలం... ఇక టెయిలెండర్లు ఏం చేస్తారో?


సఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోతున్నారు. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా నేటి ఉదయం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో మొదలైన మూడో టెస్టులో టీమిండియా పరుగులు రాబట్టేందుకు నానా పాట్లు పడుతోంది. రెండో సెషన్ ముగియకుండానే ఆరు వికెట్లను చేజార్చుకున్న టీమిండియా 50 ఓవర్లలో కనీసం 150 పరుగులు కూడా చేయలేకపోయింది. ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ లతో పాటు కెప్టెన్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రెహానే తదితరులు స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఇక స్టువర్ట్ బిన్నీ స్థానంలో నేటి మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చిన టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (2) సింగిల్ డిజిట్ కే వెనుదిరిగాడు. వృద్ధిమాన్ సాహా(7) ఒక్కడే పోరాడుతున్నాడు. మిగిలిన వారంతా టెయిలెండర్లే కావడంతో టీమిండియా స్కోరు 200 మార్కునైనా చేరుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. సఫారీ బౌలర్లలో మోర్నె మోర్కెల్ మూడు వికెట్లతో రెచ్చిపోగా, షిమోన్ హార్మర్ రెండు వికెట్లు తీశాడు. 50 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 131 పరుగులు చేసింది. క్రీజులో సాహాకు రవిచంద్రన్ అశ్విన్ (5) జతకలిశాడు.

  • Loading...

More Telugu News