: స్థానికుడు కాకపోవడం వల్లనే సర్వే ఓడిపోయారు: శంకర్రావు
మాజీ మంత్రి, సీనియర్ నేత శంకర్రావు చాలా రోజుల తరువాత మీడియా ముందుకొచ్చారు. వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక ఫలితాలపై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలో ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదని, అభ్యర్థి సర్వే సత్యనారాయణ అని వ్యాఖ్యానించారు. సర్వే స్థానికుడు కాకపోవడం వల్లే వరంగల్ ప్రజలు ఓడించారని చెప్పారు. గతేడాది మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన ఆయనకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని శంకర్రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.