: మాట మార్చిన ఏపీ డిప్యూటీ సీఎం కేఈ... ‘సీమ’ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని వ్యాఖ్య


ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట మార్చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధిపై పెట్టినంత శ్రద్ధ రాయలసీమపై పెట్టడం లేదని గతంలో ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చిన ఉభయ గోదావరి జిల్లాలపై ఆసక్తి కనబరుస్తున్న చంద్రబాబు, తక్కువ స్థానాలు ఇచ్చిన కర్నూలు జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించి సోంత పార్టీ నేతలనే సందిగ్ధంలో పడేశారు. తాజాగా కొద్దిసేపటి క్రితం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను స్థాపించడం ద్వారా కర్నూలు జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా చంద్రబాబు మారుస్తున్నారని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News