: టంగ్దార్... మరో ‘ఉధంపూర్’...‘ఉగ్ర’దాడిలో జవాను మృతి, నలుగురికి గాయాలు
జమ్మూ కాశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు ఇటీవల రాజస్థాన్ లోని ‘ఉధంపూర్’ దాడిని గుర్తు చేశారు. ఉధంపూర్ లోనూ మెరుపు దాడి చేసి ఉగ్రవాదులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న టంగ్దార్ సెక్టార్ లోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత సైనికులు క్షణాల్లోనే మేల్కొన్నప్పటికీ భారీ నష్టం జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఉగ్రవాదుల గ్రనేడ్ దాడిలో సైన్యానికి చెందిన చమురు కేంద్రం తగలబడిపోయింది. ప్రస్తుతం అక్కడ ఇరువర్గాల మధ్య ఇంకా భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి.