: హోదా సంగతి తెలియదు కానీ, ముఖ్యమంత్రి డబ్బులు మాత్రం తీసుకుని వస్తాడు: జేసీ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా తీసుకువస్తారా? లేదా? అన్న సంగతి తనకు తెలియదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి అవసరమయ్యే నిధులు మాత్రం ముఖ్యమంత్రి సాధిస్తారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమయ్యే నిధులు కేంద్రం నుంచి రాబట్టేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారని ఆయన వెల్లడించారు. ప్రత్యేకహోదాపై డిమాండ్ చేస్తామని ఆయన అన్నారు. హోదా సంగతి పక్కన పెడితే నిధులు రాబడతామని ఆయన చెప్పారు.