: హోరెత్తే సంగీతంతో తాగుబోతులు పరార్!
బ్రిటన్‌లోని డోర్‌సెట్ కౌంటీలో ఉన్న బౌర్న్‌మౌత్ పట్టణంలోని బస్టాండ్లలో నిద్రపోయే వారి సంఖ్య రాను రాను పెరిగిపోతోందట. ఇళ్లు లేని వారితో పాటు కొంతమంది తాగుబోతులు రాత్రి సమయాల్లో అక్కడికి చేరుకుని ప్రయాణికులకు చికాకు కల్గిస్తున్నారు. వారిని అక్కడి నుంచి పంపించి వేసేందుకుగాను, ఆ పట్టణ కౌన్సిల్, పోలీసులు సరికొత్త ఆలోచన చేశారు. అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరున్నర దాకా బ్యాగ్‌పైపర్ మ్యూజిక్‌ను వినిపిస్తున్నారు. దీంతో వారికి నిద్ర పట్టకపోగా, ఇదెక్కడి గొడవరా బాబూ! అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నారుట. కానీ, ప్రయాణికులకు, అక్కడి స్థానికులకు మాత్రం ఈ సౌండుతో పిచ్చెక్కినంత పని అవుతోందట.