: 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఎలక్ట్రిక్ బైక్ రెడీ
200 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోయే ఎలక్ట్రిక్ బైక్ ను ఆస్ట్రియా శాస్త్రవేత్తలు రూపొందించారు. జొహమర్ జె1 పేరిట రూపొందించిన ఈ బైకును వాణిజ్య స్థాయిలో రూపొందించేందుకు ప్రణాళికలు రచించారు. ఇంధన ట్యాంకు స్థానంలో లిథియం ఆయాన్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి అనుసంధానిస్తూ మల్టీఫంక్షనల్ మిర్రర్ కలర్ స్క్రీన్ గా, స్పీడో మీటర్ గా, ఇతర ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. సూపర్ బైక్ లలో వినియోగించే సస్పెన్షన్లు దీనిలో వినియోగించారు. దీనిని వివిధ రంగుల్లో తయారు చేసి, మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.