: డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం: కేసీఆర్


డీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రెండు నెలల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. నెల రోజుల్లో ఉద్యోగుల విభజన జరుగుతుందని చెప్పారు. డీఎస్సీకి సంబంధించి 15 నుంచి 20 వేల వరకు పోస్టుల ఖాళీలు ఉన్నాయని తమకు నివేదిక వచ్చిందన్నారు. అదేవిధంగా త్వరలోనే నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. కాగా, వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

  • Loading...

More Telugu News