: ముషారఫ్ మధ్యంతర బెయిల్ రద్దు చేసిన లాహార్ హైకోర్టు


బెనజీర్ భుట్టో హత్య కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మధ్యంతర బెయిల్ ను లాహార్ హైకోర్టు రద్దుచేసింది. దాంతో ముషారఫ్ ను పాక్ ఎఫ్ఐఏ (ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ) ఏ సమయంలోనైనా అరెస్టు చేసే అవకాశముందని న్యాయవాది చౌదురీ అజహర్ మీడియాకు వెల్లడించారు. పాక్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వీయ బహిష్కరణ అనంతరం గతనెల ముషారఫ్ స్వదేశానికి తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో పలు కేసులు ఎదుర్కొంటున్న ఆయనకు ఇస్లామాబాద్ కోర్టు అంతకుముందు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ గడువును ఒకసారి పొడిగించిన కోర్టు, చివరికి న్యాయమూర్తులను నిర్భంధించిన కేసులో అరెస్టు చేయాలని ఆదేశించింది. అనంతరం రెండు వారాల జ్యుడిషియల్ రిమాండు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మాజీ అధ్యక్షుడిని ఆయన ఫాం హౌస్ లోనే నిర్భంధంలో ఉంచారు. ఈ సమయంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ మాజీ అధ్యక్షుడు పెట్టుకున్న పిటిషన్ నిరాకరణకు గురైంది.

  • Loading...

More Telugu News