: ఈ ఉద్యోగానికి వయస్సుతో పనిలేదు!


ఈ ఉద్యోగానికి వయస్సుతో పనిలేదు. అవును, ఈ ప్రకటన నిజమే. స్కాట్లాండ్ కు చెందిన ఒక చాక్లెట్ సంస్థ ఈ ప్రకటన చేసింది. ఈ ఉద్యోగానికి కావల్సిన అర్హతల్లా... చాక్లెట్లను రుచి చూసి చెప్పాలి. అయితే, క్వాలిటీ కంట్రోల్ చూసుకోవడం, ఇతర కంపెనీల చాక్లెట్లను రుచి చూడటం, మరింత రుచికరంగా ఆ కంపెనీ ఉత్పత్తి ఉండేందుకు సూచనలు ఇవ్వాల్సి వుంటుంది. ఎంపికైన వ్యక్తిని చీఫ్ చాకోలేట్ టేస్టర్ గా నియమిస్తామని అబర్దీన్ షైర్ లోని మాకీ చాకోలేట్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న ఈ సంస్థకు ఇతర ఉత్పత్తులు కూడా ఉన్నాయి. వచ్చేనెల 3వ తేదీ లోపు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News