: బీహార్ లో ప్రభుత్వ బంగ్లాల కోసం ఆర్జేడీ ఎమ్మెల్యేల ఆరాటం... క్లాస్ తీసిన లాలూ


బీహార్ లో కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ బంగ్లాల కోసం ఎగబడుతుండటం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం కేటాయించకముందే ఆర్జేడీ, జేడీయూ ఎమ్మెల్యేలు విలాసవంతమైన అధికారిక నివాసాల కోసం ఆరాటపడుతూ కొట్లాటలకు దిగారు. దాంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలకు లాలూ క్లాస్ తీశారు. కాస్త పద్ధతిగా మసులుకుని జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కూడిన మహాకూటమి గౌరవాన్ని నిలపాలని సూచించారు. తప్పుడు పనులతో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకూడదంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా మొట్టికాయలు వేశారు. గతంలో తాను ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా నాలుగు నెలలు చప్రాసీ క్వార్టర్ లో గడిపానని, ఈ విషయాన్ని కొత్త ఎమ్మెల్యేలు గుర్తించాలని లాలూ చెప్పారు.

  • Loading...

More Telugu News