: టర్కీ చర్య తీవ్రమైనది: పుతిన్
రష్యాకు చెందిన యుద్ధ విమానం సుఖోయ్ ఎస్ యూ-24ను టర్కీ సైన్యం కూల్చివేయడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టర్కీ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తమ రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన దిశగా అడుగులు వేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ గగనతలంలోకి ప్రవేశించిందన్న కారణంతో యుద్ధ విమానాన్ని కూల్చివేయడం సరికాదని ఆయన తెలిపారు. కాగా, విమానం కూల్చి వేయడంతో ఎజెక్ట్ బటన్ ద్వారా విమానం నుంచి ప్రాణాలతో బయటపడ్డ పైలట్ ను ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పట్టుకున్నారు. ఐఎస్ కు, రష్యాకు మధ్య తీవ్ర విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.