: ఇకపై హైదరాబాదులో ఉండుడు తక్కువ...జిల్లాల్ల ఉండుడు ఎక్కువ: కేసీఆర్


ఇకపై హైదరాబాదులో ఉండుడు తక్కువ, జిల్లాల్ల ఉండుడే ఎక్కువని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వరంగల్ ఉపఎన్నికల్లో విజయంపై ఆయన మాట్లాడుతూ, అఖండ మెజారీటీ ఇచ్చి ప్రజలు తమ నిర్ణయం స్పష్టంగా చెప్పారని అన్నారు. తమపై లేనిపోని వ్యాఖ్యలు చేసే విపక్షాలు, ఆంధ్రజ్యోతి పత్రిక ఇప్పుడేమంటాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన తమ పార్టీపై అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు న్యాయం వైపు ఉన్నారని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఏం చేయాలో తమకు మాత్రమే తెలుసని ఆయన అన్నారు. హుస్సేన్ సాగర్ లో కుళ్లు నీరు తీసేస్తానంటే ఒప్పుకోరు, ఉస్మానియా ఆసుపత్రిని కొత్తగా నిర్మిస్తానంటే వద్దంటారు. తాను హెలీకాప్టర్ లో సర్వే చేస్తే, కిందికి దిగమంటారు. పాదయాత్ర చేస్తే, నువ్వేమన్నా కార్పొరేటర్ వా? అని అడుగుతారు. ఇలా అనవసరమైన లొల్లి ఎక్కువైందని ఆయన విపక్షాలపై మండిపడ్డారు. 2021 నాటికి తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఆంధ్రా పాలకులు తెలంగాణలో అర్థంపర్థం లేని ప్రాజెక్టులు నిర్మించారని ఆయన ఆరోపించారు. ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాల్లోనే ఎక్కువ సమయం గడుపుతానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి, ఒక్కో జిల్లాలో పది రోజులు లేదా పదిహేను రోజులు గడిపి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టి అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుని మరీ వాటిని పూర్తి చేస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News