: అమీర్ ఖాన్ పై ఢిల్లీలో కేసు, ముంబైలో ఆందోళన
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పై ఢిల్లీలో అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అమీర్ ఖాన్ దేశ ప్రజలను అవమానించారని పేర్కొంటూ కేసు నమోదైంది. కాగా, అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై ముంబైలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ అమీర్ ఇంటి వరకు సాగుతుందని ప్రకటించారు. దీంతో ఆందోళనకారులు అనుచితంగా ప్రవర్తించకుండా ఉండేందుకు అమీర్ ఖాన్ ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.