: తెలంగాణలో 231 కరవు మండలాలు... కేంద్రానికి నివేదిక పంపిన ప్రభుత్వం


ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం కరవు మండలాలను నిర్ధారించింది. రాష్ట్రంలో 231 కరవు మండలాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపింది. హైదరాబాదులో క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కరవు మండలాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పోచారం, ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షపాతం బాగానే ఉందని, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పూర్తి కరవు పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలలో పాక్షికంగా కరవు ఉందని నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 231 మండలాల్లో కరవు నెలకొందని, ఇందుకు కేంద్రం తక్షణమే రూ.వెయ్యి కోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరవు మండలాల పరిశీలనకు కేంద్రం వెంటనే రాష్ట్రానికి ఒక బృందాన్ని పంపించాలని కోరారు.

  • Loading...

More Telugu News