: ఓరుగల్లు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారు: సీఎం కేసీఆర్


టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి వరంగల్ ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకు ఓరుగల్లు ప్రజలకు తన రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఈ విజయంతో తమ బాధ్యతలు పెరిగాయని, ప్రభుత్వం పనితీరుకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా దీనిని భావిస్తున్నానని పేర్కొన్నారు. వరంగల్ విజయం నేపథ్యంలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఈ మేరకు మాట్లాడారు. వరంగల్ తీర్పుతో సంక్షేమ కార్యక్రమాలకే ప్రజలు పట్టం కట్టారని అర్థమవుతోందన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాల వైఖరిపై ఆయన మాట్లాడారు. కావాలని తనపై, పార్టీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారని అన్నారు. ఇటువంటి అసహన వైఖరి మంచిది కాదని సూచించారు. ఇన్ని ఓట్లు బతిమాలితే వచ్చేవి కావన్నారు. ప్రజలు వెల్లువలా వచ్చి టీఆర్ఎస్ కి ఓట్లు వేశారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News