: అమీర్ వ్యాఖ్యలు తప్పు: అసదుద్దీన్ ఒవైసీ
ప్రముఖ సినీ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భారతదేశం వీడుతానని అనడం స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమేనని అన్నారు. భూమండలం ఉన్నంత వరకు భారతదేశం నుంచి తమను ఎవరూ వేరు చేయలేరని ఆయన స్పష్టం చేశారు. తాము భారత్ ను వీడి వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని ఆయన తెలిపారు. అమీర్ ఖాన్ దేశాన్ని వీడుతానని అనడం సరికాదని ఒవైసీ పేర్కొన్నారు. కాగా, అమీర్ ఖాన్ మత అసహనం వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.