: అమెరికా బుట్టలో పడకండి: పుతిన్ కు ఇరాన్ సలహా
అమెరికా చేస్తున్న వాదనలో వాస్తవం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనెల్ రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ కు సూచించారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్ పై యుద్ధానికి సిద్ధమవ్వాలని, అవసరమైతే ఉగ్ర సంబంధాలు గల దేశాలతో బంధాలను కూడా తెంచుకోవాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ తో సమావేశమైన పుతిన్ పలు అంశాలపై చర్చించారు. సిరియా ప్రభుత్వానికి మద్దతుగా ఇరాన్ సైన్యాన్ని రంగంలోకి దింపుతుందని ఆయన పుతిన్ కు స్పష్టం చేశారు. తన బలగాలను దించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగా సిరియాపై అమెరికా పలు ఆరోపణలు చేస్తోందని ఆయన పుతిన్ కు స్పష్టం చేశారు. మధ్య ప్రాశ్చంలో ఇతర దేశాల జోక్యాన్ని అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రష్యా-ఇరాన్ మధ్య జరిగిన అణు ఒప్పందాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని రెండు దేశాల అధినేతలు నిర్ణయించారు. మిసైళ్లను ధ్వంసం చేయగల ఎస్-300 రకం రాకెట్లను ఇరాన్ కు అందజేసేందుకు పుతిన్ అంగీకరించారు. పుతిన్ ఇరాన్ సుప్రీం లీడర్ తో చర్చించేందుకు కారణమేంటంటే...ముస్లింలలో సున్నీ, షియా అనే రెండు ప్రధాన తెగలు ఉన్నాయి. మెజారిటీ ముస్లిం దేశాలు షియాల అధీనంలో ఉండగా, ఇరాన్ మాత్రమే సున్నీ అధికారిక దేశంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సిరియాలో అధ్యక్షుడిగా కొనసాగుతున్న సున్నీ వర్గ నేత అసద్ ను గద్దె దించాలని షియాలు తిరుగుబావుటా ఎగురవేశారు. వీరికి అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఈ ఆయుధాలను షియాల తిరుగుబాటుదారులైన ఐఎస్ఐఎస్ కు అందజేస్తున్నారు. అదే సమయంలో తిరుగుబాటు దారులకు అనుకూలంగా ఉన్న ఐఎస్ సైన్యంపై దాడులకు తెగబడుతోంది. కారణం ఐఎస్ఐఎస్ కూడా షియా వర్గానికి చెందిన ఉగ్రవాద సంస్థ కావడమే!