: షీనా ఒక వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకుందని అమ్మ చెప్పేది: ఇంద్రాణి మరో కూతురు విధి


షీనా బోరా హత్య కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇంద్రాణి ముఖర్జియా మరో కూతురు విధిని సీబీఐ అధికారులు విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. షీనా బోరా అమెరికాలోని ఒక వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకుందని తన తల్లి తనకు స్వయంగా చెప్పిందని విధి వెల్లడించింది. ఈ విచారణలో విధి చెప్పిన విషయాలను సీబీఐ అధికారులు రికార్డు చేశారు. వాటి వివరాలు ... ‘2012లో షీనా కనిపించకుండాపోయిన సందర్భంలో ఆమె గురించి అమ్మ ఇంద్రాణిని అడిగాను. షీనా అమెరికాలో వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకుందని మా అమ్మ సమాధానమిచ్చింది. షీనా- రాహుల్ ప్రేమ వ్యవహారం ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాలకు నచ్చేది కాదు. ఈ విషయమై షీనాను చాలాసార్లు కోప్పడ్డారు. షీనా తనకు సోదరి అని చెప్పి 2009లో అమ్మ ఇంద్రాణి నాకు పరిచయం చేసింది. అయితే, 2009-10 సంవత్సరాల మధ్య కాలంలో ఈ విషయం అబద్ధమని రాహుల్ ద్వారా నాకు తెలిసింది. ఈ విషయమై అమ్మను ప్రశ్నిస్తే రాహుల్ చెప్పేదంతా అబద్ధమని, తనపై కోపంతో ఈ విధంగా చెబుతున్నాడనేది. షీనా హత్య తర్వాత వేరే ఈ-మెయిల్ నుంచి తనకు మెయిల్స్ వచ్చేవి’ అని విధి చెప్పినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News