: భారతీయ సినీరంగ ప్రముఖులకు నివాళిగా ‘మరోచరిత్ర’ ప్రదర్శన


1978లో విడుదలైన అద్భుత ప్రేమ కథా చిత్రం మరో చరిత్ర. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కమలహాసన్, సరిత హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. సుమారు 37 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రాన్ని గోవాలో జరుగుతున్న 46వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ఈ రోజు ప్రదర్శించనున్నారు. భారతీయ సినీ రంగ ప్రముఖులకు నివాళిగా, దర్శకుడు బాలచందర్, సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ ల గౌరవార్థం ఏర్పాటు చేసే ప్రదర్శనలో భాగంగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. కాగా, మరోచరిత్ర సినిమా కథ, కమల్-సరితల అభినయం, సంగీతం, సంభాషణలు.. ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. 1981లో ఇదే చిత్రాన్ని హిందీలో 'ఏక్ దూజే కేలియా' పేరుతో రూపొందించారు. హిందీలో కూడా ఇది సూపర్ హిట్టయింది.

  • Loading...

More Telugu News