: డోలు పట్టిన విజయారెడ్డి... టీఆర్ఎస్ సంబరాల్లో పీజేఆర్ తనయ సందడి


వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోంది. ఆ పార్టీ విజయం ఇప్పటికే ఖరారు కాగా, మెజారిటీ మాత్రమే తేలాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ మెజారిటీ 4 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో విజయంపై అధికారిక ప్రకటన వెలువడకముందే టీఆర్ఎస్ లో సంబరాలు జోరందుకున్నాయి. అటు వరంగల్ తో పాటు ఇటు హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ, రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాదులో జరిగిన సంబరాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) తనయ, టీఆర్ఎస్ ఖైరతాబాదు ఇన్ చార్జీ విజయారెడ్డి సందడి చేశారు. భుజానికి డోలు తగిలించుకుని ఆమె కార్యకర్తలతో కలసి ఆడి పాడారు. విజయారెడ్ది ఉత్సాహం చూసిన పార్టీ కార్యకర్తలు మరింత జోష్ పెంచారు.

  • Loading...

More Telugu News