: అమీర్ వ్యాఖ్యలు ఆయన అభిమానులను అవమానించేలా ఉన్నాయి: కేంద్ర మంత్రి నఖ్వీ
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మత అసహనంపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తన అభిమానులను అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. అటు రాజకీయ ప్రేరేపితంగా కూడా ఉన్నాయని ఆరోపించారు. అయితే అమీర్ దేశం విడిచి వెళ్లిపోవాలని తాము కోరుకోవడం లేదని, ఇక్కడాయన క్షేమంగానే ఉన్నారని నఖ్వీ ఢిల్లీలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మత ఘర్షణలు తగ్గాయని మరో కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఏదో గుడ్డిగా ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ప్రజలను అమీర్ ఖాన్ భయాందోళనకు గురి చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి నళిని కోహ్లీ ఆరోపించారు.