: నాగార్జున వర్సిటీలో మంత్రి గంటా పరిశీలన... తాజా ర్యాగింగ్ ఘటనపై అసంతృప్తి


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీని మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. వర్సిటీలో కొన్ని నెలల కిందట ర్యాగింగుకి బలైన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటన ఇంకా మరువక ముందే నిన్న (సోమవారం) మరో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. దానిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గంటా ఈరోజు వర్సిటీకి వచ్చారు. సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను పరిశీలించారు. వర్శిటీలో తాజాగా వెలుగు చూసిన ర్యాగింగ్ కలకలంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత విభాగాధిపతులు, వర్సిటీ అధికారులు, విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం తదితరులతో సమీక్ష నిర్వహించారు.

  • Loading...

More Telugu News