: చెన్నై ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం


తమిళనాడు రాజధాని చెన్నై ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దాదాపు 8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. దాని విలువ రూ.2.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు. అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఓ ప్రయాణికుడి నుంచి 5.5 కేజీల బంగారం, మరో ప్రయాణికుడి నుంచి 2.5 కేజీల బంగారం లభ్యమైందని వివరించారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News