: మీకు పాస్ పోర్టు ఉందా? రేపటి నుంచి చెల్లుతుందో... చెల్లదో చూసుకోండి!
మీరు ఏదైనా విదేశాలకు ప్రయాణమవుదామని భావిస్తున్నారా? ఒక్కసారి మీ పాస్ పోర్టు చెక్ చేసుకోండి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్ (ఐసీఏఓ) నిబంధనల ప్రకారం, చేత్తో రాసి ఉన్న పాస్ పోర్టులు 25వ తేదీ, అంటే రేపటి నుంచి చెల్లవు. ఐసీఏఓ సభ్య దేశాల్లో భారత్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంఘంలో సభ్యులుగా ఉన్న ఏ దేశం కూడా చేత్తో రాసివున్న పాస్ పోర్టులకు ఇక వీసాలు జారీ చేయవు. ఇండియాలో 2001 కన్నా ముందు జారీ అయిన పాస్ పోర్టులన్నీ చేత్తో రాసినవే. సాధారణంగా ఈ తరహా పాస్ పోర్టు రెన్యువల్ కాలపరిమితి 20 సంవత్సరాలు ఉంటుంది. అంటే, ఇప్పటికీ ఇండియాలో ఈ తరహా పాస్ పోర్టులు ఉన్నాయన్న మాట. వీటన్నింటినీ తక్షణం మార్చుకోకుంటే, వీరింక విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కోల్పోతారు. ఈ తరహా పాస్ పోర్టులను కలిగివున్న వారు కొత్త పాస్ పోర్టుల కోసం దరఖాస్తు చేస్తే వెంటనే జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.