: కేసీఆర్ పాలనకు వరంగల్ ఫలితాలు నిదర్శనం: గట్టు రామచంద్రరావు


వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం దిశగా వెళుతుండటంపై ఆ పార్టీ నేతలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. వరంగల్ ఫలితాలు సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనమని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీని టీఆర్ఎస్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలతో తెలంగాణను విచ్ఛిన్నం చేయాలనుకున్న కుట్రను వరంగల్ ప్రజలు తిప్పి కొట్టారని, కేసీఆర్ పాలన ప్రజల వద్దకు వెళ్లిందనడానిని ఈ ఫలితాలు నిరూపించాయని గట్టు పేర్కొన్నారు. ఇక ప్రచారంలో నిరసనలు ఎదురుకావడం ప్రతిపక్షాలు చేసిన సృష్టేనని ఆరోపించారు.

  • Loading...

More Telugu News