: కడియం శ్రీహరిని మించిన మెజారిటీ ఖాయం!
వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం ఖరారైపోయింది. ఇక ఆయన సాధించనున్న మెజారిటీపైనే రాజకీయ విశ్లేషకుల కళ్లు పడ్డాయి. గడచిన పార్లమెంటు ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కడియం శ్రీహరి పోటీ పడగా, ఆయనకు దాదాపు 3.90 లక్షల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు దయాకర్ దాన్ని అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉపఎన్నికల్లో భాగంగా దాదాపు 10 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఇప్పటివరకూ 3 లక్షలకు పైగా ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో దయాకర్ కు 2.31 లక్షల ఓట్లు వచ్చాయి. ప్రధాన పోటీదారులుగా భావించిన దేవయ్య, సర్వేలకు వచ్చిన ఓట్ల సంఖ్య ఇప్పటికీ 30 వేలు దాటలేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే, దయాకర్ కు 5 లక్షలకు మించిన మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది.