: ఇప్పుడు గ్రీస్ వంతు... బిజినెస్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద బాంబు విస్పోటనం


ఈ తెల్లవారుఝామున శక్తిమంతమైన బాంబు పేలుడుతో గ్రీస్ వణికింది. రాజధాని ఏథెన్స్ లో నిత్యమూ బిజీగా ఉండే బిజినెస్ ఫెడరేషన్ కార్యాలయాల వద్ద ఈ ఘటన జరుగగా, ఎవరూ గాయపడలేదని, పలు భవనాల అద్దాలు పగిలాయని పోలీసు అధికారులు తెలిపారు. మరికొన్ని గంటల తరువాత ఇదే పేలుడు జరిగి వుంటే ప్రాణనష్టం తీవ్రంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని, ఇప్పటికీ పూర్తిగా బయటపడని గ్రీస్ లో రాజకీయ హింసాకాండ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పేలుడు తామే జరిపినట్టు ఇప్పటివరకూ ఏ సంస్థా ప్రకటించలేదు. దేశంలోని ఏదైనా ఓ గెరిల్లా గ్రూప్ ఈ దాడి జరిపి ఉండవచ్చని తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 7 గంటల సమయంలో (గ్రీస్ కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 3:30) దాడి జరిగింది. ఆపై ఓ అరగంట తరువాత స్థానిక దినపత్రికకు బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News