: మీరేం చేయాలంటే... ఎంపీలకు క్లాస్ పీకిన 'అమ్మ'!


గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, అన్నా డీఎంకే సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై ఆ పార్టీ అధినేత్రి జయలలిత, ఎంపీలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. రాష్ట్రానికి మేలు చేకూర్చేలా ప్రస్తావించాల్సిన అంశాలను, ఏ సమయంలో, ఏ సమస్యను గురించి మాట్లాడాలన్న విషయాలను ఆమె స్వయంగా వివరించారు. రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలకు వచ్చిన వరదలు, తమిళ మత్స్యకారులపై లంక భద్రతా దళాల దాడులు, కచ్చ దీవుల అంశాలను సభలో లేవనెత్తాలని ఆమె సూచించినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాష్ట్రానికి తెచ్చేందుకు కూడా కృషి చేయాలని ఆమె తన పార్టీ ఎంపీలకు తెలియజేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News