: నాడు జైలుకెళ్లాడు, నేడు రాహుల్ పక్కన కనిపించాడు!
రాహుల్ గాంధీ షహరాన్ పూర్ లో పర్యటిస్తున్న వేళ, ఆయన పక్కనే ఎక్కువగా కనిపిస్తున్న ఓ కాంగ్రెస్ నేత అందరినీ ఆకర్షించాడు. గతంలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇమ్రాన్ మసూద్ అనే నేతను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. గత సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయింది కూడా మసూదే కావడం గమనార్హం. ప్రస్తుత రాహుల్ పర్యటనలో షహరాన్ పూర్ కే చెందిన మసూద్ అనుక్షణం రాహుల్ పక్కనే ఉండటం గమనార్హం. పార్లమెంటు ఎన్నికలకు మరో మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచి యూపీలో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ విస్తృత పర్యటనలు జరుపుతున్నారు. దీనికితోడు 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయి పర్యటనలకే రాహుల్ ప్రాధాన్యమివ్వాలని భావించినట్టు తెలుస్తోంది. తన పర్యటనల్లో భాగంగా, ప్రజలతో మమేకమవుతున్న రాహుల్ వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.