: చనిపోతున్నానని తెలిసీ, హెలికాప్టర్ ను మైదానంలో కూల్చి, ప్రాణనష్టాన్ని నివారించిన హైదరాబాదీ మహిళా పైలట్
నిన్న వైష్ణోదేవి నుంచి భక్తులను తీసుకువస్తూ, ప్రమాదానికి గురై కుప్పకూలిన హెలికాప్టర్ లో పైలట్ సుమిత్రా మహాజన్ కూడా చనిపోయారు. గతంలో ఎయిర్ ఫోర్సులో పైలట్ గా విధులు నిర్వహించిన ఈ హైదరాబాదీ, ప్రస్తుతం హిమాలయా హెలీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. కాగా, సాంఝిచాట్ నుంచి ఖత్రాకు బయలుదేరిన చాపర్ కూలిపోవడానికి కారణం, ఓ పక్షి ఢీకొట్టడమేనని తెలుస్తోంది. చాపర్ ను కిందకు దించేందుకు సుమిత్ర ప్రయత్నించినా, రోటర్ దెబ్బతినడంతో అదుపుతప్పి కూలిందని, అప్పటికి కూడా, జనావాసాలపై హెలికాప్టర్ పడకుండా ఆమె చూడగలిగారని దర్యాఫ్తు అధికారులు తెలిపారు. చాపర్ కూలే సమయంలో, తాము చనిపోతామని తెలిసినా, సుమిత్ర ఎంతో ధైర్యంగా వ్యవహరించారని తెలిపారు.