: పుస్తకంగా సినీ నటుడు మోహన్ బాబు ఆత్మకథ?
విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటుడు మోహన్ బాబు నటనా ప్రయాణం నలభై ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తన ఆత్మకథను పుస్తకంగా తీసుకురానున్నట్టు టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తన జీవిత విశేషాలు, ఎదురైన అనుభవాలు, ఇంకెన్నో విషయాలతో రాస్తున్న ఈ పుస్తకం ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే నూతన సంవత్సరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని అంటున్నారు. కాగా, స్వర్గం-నరకం చిత్రం ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన మోహన్ బాబు తన దైన నటనతో ప్రేక్షకులను మైమరపించారు. విలన్ పాత్రల నుంచి క్రమేపి హీరోగా ఎదిగి, డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఆత్మకథలో ఎన్ని సంచలన విషయాలు ఉంటాయోనని సినీ పండితులు అంటున్నారు.