: ఐఎస్ దృష్టిలో భారతీయ ఫైటర్లు పోరాటయోధులు కాదు: ‘ఇంటెలిజెన్స్’ నివేదిక


అరబ్ ఫైటర్లతో పోలిస్తే భారతీయులు సహా దక్షిణాసియా వాసులు గొప్ప పోరాట యోధులు కాదని ఐఎస్ఐఎస్ భావిస్తోందన్న విషయాన్ని అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రూపొందించిన నివేదికను భారత్ సంస్థలకు అందజేశాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాలతో పాటు నైజీరియా, సూడాన్ దేశాల నుంచి ఐఎస్ఐఎస్లో చేరిన ఉగ్రవాదులను అరబ్ ఫైటర్ల కంటే తక్కువ స్థాయిలో పరిగణిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అరబ్ ఫైటర్లకు ఆఫీసర్ కేడర్ స్థాయి, అత్యాధునిక ఆయుధాలు, వేతనాలు, వసతులు కల్పిస్తున్నారు. మిగిలిన వారికి మాత్రం అరబ్ ఫైటర్ల కంటే తక్కువ హోదా, జీతాలు ఇస్తూ, చిన్న చిన్న బ్యారక్లలో ఉంచుతున్నారు. ఆత్మాహుతి దాడులకు ఎక్కువగా వీరినే పంపిస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది.

  • Loading...

More Telugu News