: ఎలుక కూడా సెల్ఫీ తీసుకుంది!


ఒక ఎలుక యాదృచ్ఛికంగా సెల్ఫీ తీసుకుంది. న్యూయార్క్ సిటీ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ వింత సంఘటనపై ప్రత్యక్షసాక్షి డాన్ రిచర్డ్స్ అనే టూరిస్టు చెప్పిన కథనం ప్రకారం... రైల్వే ఫ్లాట్ ఫారంపై ఉన్న ఒక గోడకు ఆనుకుని ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. ఎటునుంచి వచ్చిందో కానీ, ఒక ఎలుక అతనిపై నుంచి పాకుతోంది. దీంతో, ఆ వ్యక్తికి ఒక్కసారిగా మెలకువ రావడమే కాకుండా కంగారు పడిపోయాడు. పైకి లేచే క్రమంలో అతని జేబులో ఉన్న సెల్ ఫోన్ కింద పడింది. అతను లేచి నిలబడటంతో ఎలుక కూడా కింద పడటం, పడి ఉన్న సెల్ ఫోన్ పై నుంచి అది పరిగెత్తడం జరిగాయి. ఈ క్రమంలో కెమెరా బటన్ పై కాలువేయడంతో ఆ ఎలుకసెల్ఫీకి చిక్కింది. ఇదంతా వీడియో తీసిన సదరు ప్రత్యక్షసాక్షి రిచర్డ్స్ దానిని యూట్యూబ్ లో పెట్టాడు. ఇప్పుడిది హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News