: సింగపూర్ ప్రధానితో మోదీ సెల్ఫీ!
సింగపూర్ ప్రధాని లీ హసిన్ లింగ్ దంపతులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను మోదీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, మలేషియా పర్యటన అనంతరం మోదీ సోమవారం సింగపూర్ వెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి ఘనస్వాగతం పలికారు. కాగా, సింగపూర్ 37వ లెక్చర్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్-సింగపూర్ దేశాల చిరకాల మైత్రి ఇదే విధంగా కొనసాగాలని, విజయపథంలో రెండు దేశాలు నడవాలని ఆయన ఆకాంక్షించిన విషయం తెలిసిందే.