: మళ్ళీ కరెంట్ షాకివ్వనున్న సర్కారు


ఇప్పటికే పెరిగిన విద్యుత్ ఛార్జీలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకంపై మరోసారి సర్ ఛార్జీల వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. 2012-13 మూడవ త్రైమాసికానికి గాను సర్ ఛార్జీ వసూలు చేయాలని విద్యుత్ శాఖకు ఈఆర్సీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో, గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వినియోగించిన విద్యుత్ కు యూనిట్ కు 55 పైసల చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తాజా వడ్డనతో ప్రజలపై రూ. 609 కోట్ల మేర భారం పడనుంది. కాగా, ఈ నూతన సర్ ఛార్జిని వచ్చే జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వసూలు చేస్తారు.

  • Loading...

More Telugu News