: ‘సింగపూర్’తో చాలా పాఠాలు నేర్చుకుంటున్నాం: ప్రధాని మోదీ


సింగపూర్ నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటున్నామని, ఆ దేశాభివృద్ధి భారతీయులకు స్ఫూర్తి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 37వ సింగపూర్ లెక్చర్ లో మోదీ మాట్లాడారు. భారత్ ఆధునికీకరణలో జపాన్ దేశం కీలక పాత్ర పోషించిందని, చైనా ఆర్థికాభివృద్ధి భారత్ కు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. భాగస్వామ్య ఒప్పందాలను మెరుగుపరచుకుంటున్నామని, ఉగ్రవాదం వంటి సమస్యలపై పోరాడాలంటే ఆర్థికపరమైన అంశాలను పంచుకోవాలని మోదీ సూచించారు. నైపుణ్య శిక్షణ, బాలికల విద్య, పరిశుభ్రమైన నదులు, ఆకర్షణీయమైన నగరాలపై పెట్టుబడులు పెడుతున్నామన్నారు. అభివృద్ధితో పాటు పారిశుద్ధ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. నూతన ఆవిష్కరణలకు వనరులలేమి ఆటంకం కాదన్నారు. చట్టాలు, నిబంధనలు, విధానాలు, సంస్థల సంస్కరణలతో అవకాశాలు సృష్టిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ భారత్’ అంశాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. ఈ కార్యక్రమం నగరాల స్వచ్ఛత కోసం మాత్రమే చేపట్టింది కాదన్నారు. మన ఆలోచనలు, కార్యాచరణలో మార్పు కోసమే స్వచ్ఛ భారత్ అని అన్నారు.

  • Loading...

More Telugu News