: వరంగల్ పీఠం మాదే: కాంగ్రెస్ నేత గండ్ర
వరంగల్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో, అన్ని పార్టీల నేతలతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికలో గెలుపు తమదే అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలకు పాల్పడినా, అంతిమ విజయం తమదే అని చెప్పారు. ఓడిపోతామన్న భయంతోనే ఓటర్లకు టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంపిణీ చేసిందని మండిపడ్డారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ తీర్పు టీఆర్ఎస్ కు గుణపాఠం నేర్పుతుందని అన్నారు.