: రూ. 34 వేల దిగువకు వెండి, మరింత తగ్గిన బంగారం!
కొత్తగా కొనుగోళ్లు నమోదు కాక, బులియన్ మార్కెట్ స్తబ్ధుగా సాగడంతో సోమవారం నాటి సెషన్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 100 తగ్గి రూ. 25,650కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 225 తగ్గి రూ. 33,800కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోలు స్పందన లేకపోవడమే ధరల తగ్గుదలకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,067 డాలర్ల వద్ద కొనసాగింది. వెండి ధర ఔన్సుకు 13.9 డాలర్లుగా ఉంది. 2009 ఆగస్టు తరువాత ఇంటర్నేషనల్ మార్కెట్లో బులియన్ మార్కెట్ ఇంతగా కుదేలు కావడం ఇదే తొలిసారి.