: చంద్రబాబుకు వేంకటేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయి: దేవినేని ఉమా


రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు యజ్ఞానికి తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. అందువల్లే రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ ను ఈ రోజు ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల చేతకాని తనం వల్లే రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని మండిపడ్డారు. ఏడాదికి రూ. 10 వేల కోట్లను కేటాయించి, ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News