: అవినీతిని సహించే ప్రసక్తే లేదు: ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, అనివీతికి పాల్పడే వారిని సహించే ప్రసక్తే లేదని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. సోమవారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రహదారులతో పాటు సామాజిక సదుపాయాల కల్పనను మరింత మెరుగు పర్చాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలనేది తన ప్రాముఖ్యతాంశమన్నారు. నితీశ్ కుమార్ గత పాలనలో రోడ్డు నిర్మాణాలు చాలా వేగవంతంగా జరిగాయన్నారు.