: విజయవాడలో మహిళా రౌడీ షీటర్!


రౌడీ షీటర్లంటే నేరాలకు పాల్పడే పురుషులే గుర్తుకు వస్తారు. అయితే, అందుకు భిన్నంగా ఓ మహిళపై కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. నగరంలో గత 15 ఏళ్లలో ఓ మహిళపై రౌడీ షీట్ తెరవడం ఇదే తొలిసారి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 32 ఏళ్ల మహిళపై మాచవరం పోలీస్ స్టేషన్ లో ఈ రౌడీ షీట్ తెరిచారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, నేరాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఆమెపై రౌడీ షీట్ తెరిచినట్టు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News