: బీజేపీకి అబ్దుల్ కలాం మేనల్లుడు రాజీనామా
మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం మేనల్లుడు ఏపీజే షేక్ సలీమ్ బీజేపీకి రాజీనామా చేశారు. చనిపోయే ముందువరకు కలాం ఢిల్లీలో నివసించిన బంగ్లాను స్మారక కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం మార్చలేదన్న కోపంతో పార్టీని వదిలినట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్ బంగ్లాను స్మారకార్థంగా ఉంచాలని వీరు కోరుతున్నారు. కానీ ఇటీవల ఆ బంగ్లాను కేంద్ర మంత్రి మహేశ్ శర్మకు కేటాయించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఆయన తాజాగా రాజీనామా చేయడం గమనార్హం.